Posts

Showing posts from August, 2017

ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ తయారీ ఎలా?

Image
చలికాలంలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. అయితే గొంగూర ఉంటే మాత్రం ఎంచక్కా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే చాలా మందికి నోరూరుతుంది. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు కూడా చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు :  బోన్లెస్ చికెన్: అర కేజీ ‌గోంగూర : ఒక కట్ట అల్లం, వెల్లుల్లి పేస్టు : రెండు స్పూన్లు గరం మసాలా : 1 స్పూన్ పచ్చిమిర్చి : మూడు పసుపు : చిటికెడు ఉల్లిపాయలు : మూడు పోపుదినుసులు : 1 స్పూన్ కారం : రెండు టీస్పూన్లు నూనె : సరిపడా ఉప్పు : తగినంత కొత్తిమీర : తగినంత తయారీ విధానం :    చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను ఉడికించి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాత్రలో నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి అవి వేగాక చికెన్ ముక్కల్ని కూడా వేసి సన్నని మంటపై మగ్గనిచ్చి సరిపడా నీరు పోసి కొంచెం సేపు ఉడికించాలి.  ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకున్న గోంగూర ముద్ద, గరంమసాలా వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. దించుకునే ము...

చేదు చేదు కాకరతో.. టేస్టీ స్టఫింగ్ ఎలా చేయాలి..?

Image
కాకరకాయలు రుచికి చేదుగా ఉంటాయి కాబట్టి తినడానికి అంతగా ఇష్టపడరు. చిన్నపిల్లలైతే అసలే తినరు. కాకరలో చాలా రకాలున్నాయి. వీటిలో పొడుగు, పొట్టి రకాలే కాకుండా లేత ఆకుపచ్చ, తెలుపు కలగలసిన రంగులలో కూడా ఉంటాయి. కాకరకాయ వైద్యపరంగా ఔషధంగా ఉపయోగ పడుతుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో అధికంగా ఉపయోగిస్తారు. కాకరను వారానికి ఓ సారి ఆహారంలో తీసుకుంటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. అలాంటి కాకరతో స్టఫింగ్ ఎలా తయారుచేయాలో చూద్దాం.. కావలసిన పదార్ధాలు కాకరకాయలు - 5 ఆలుగడ్డలు - 3 (ఉడికించినవి)  ఉల్లిపాయతరుగు - 1/2 తరిగినవి ధనియాల పౌడర్ - 1 స్పూన్  నూనె - వేయించడానికి సరిపడా జీలకర్ర పౌడర్ - 1 స్పూన్  పోపు దినుసులు - తగినంత కారం - సరిపడా ఉప్పు - రుచికి తగినంత పసుపు -చిటికెడు పచ్చిశెనగలు - 2 స్పూన్   నూనె - సరిపడా తయారీ విధానము: కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాడలని కట్ చేసి లోపల వున్న విత్తనాలను తీసెయ్యాలి. ఒక మందపాటి గిన్నెలో కాకరకాయ ముక్కలను వేసి, రెండు గ్లాసుల నీళ్ళు పోసి, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి, ఉడికించుకోవాలి. కాకరకాయలు ఉడికిన తరవాత, న...

బనానా కోఫ్తా కర్రీ ఎలా చేయాలి?

Image
అరటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కంటికి మేలు చేస్తుంది. అలాంటి అరటికాయలతో అరటి కోఫ్తా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం కావలసిన పదార్థాలు : అరటికాయలు - 3 అల్లం పేస్ట్‌ -  తగినంత పసుపు పొడి - చిటికెడు కారం - సరిపడా, వెల్లుల్లి పేస్ట్‌ - తగినంత గరంమసాలా పౌడర్‌ - 1 స్పూన్‌, కోడిగుడ్డు - 1 శనగపిండి - 2 స్పూన్‌‌లు, పంచదార - 1 స్పూన్‌, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా.  తయారీ విధానం :  ముందుగా అరటికాయలను తొక్క తీయకుండా ఉడికించుకోవాలి. తరువాత తొక్క తీసి ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె మినహా పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి ఫ్రై చేయాలి. బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తరువాత మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కారం, పంచదార, గరం మసాలా వేసుకుని అందులో రెండు కప్పుల నీళ్...

కాశ్మీరీ మటన్ ఘోస్ట్‌ను ఎలా తయారు చేస్తారు?

Image
కావలసిన పదార్థాలు : ఎముకలు లేని మేక మాంసం... అరకేజీ పెరుగు... ఒక కప్పు యాలక్కాయలపొడి... తగినంత జాపత్రి... తగినంత దాల్చిన చెక్క... చిన్న సైజువి రెండు జీడిపప్పు... వంద గ్రా. (పేస్టు చేయాలి) అల్లం వెల్లుల్లి ముద్ద... సరిపడా నూనె... సరిపడా మీగడ... తగినంత తయారీ విధానం : మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి, జీడిపప్పు ముద్ద, పెరుగు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి కాగిన తరువాత యాలక్కాయల పొడి, జాపత్రి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.  కాసేపలా వేగిన తరువాత మీగడ, ఉడికించిన మేకమాంసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మాంసం మెత్తగా ఉడికి, కూర దగ్గర పడుతుండగా దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే కాశ్మీరీ ఘోస్ట్ తయారైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పరోటా, దోసెలతోపాటు తింటే చాలా రుచిగా ఉంటుంది. 

అజీర్తికి చెక్ పెట్టే మెంతికూర చికెన్ ఎలా చేయాలో తెలుసా?

Image
మెంతికూర, మెంతులు అజీర్తికి చెక్ పెడుతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి వాటికి చెక్ పెట్టాలంటే.. మెంతికూరను ఆహారంగా తీసుకోవాలి. మెంతికూర పప్పు, మెంతికూర వంటి రొటీన్ వంటకాలతో బోర్ కొట్టేస్తే.. మెంతికూరతో చికెన్ ట్రై చేసి చూడండి. ఎలా చేయాలంటే..? కావలసిన పదార్థాలు  చికెన్ : ఒక కేజీ  మెంతికూర : రెండున్నర కప్పు  పెరుగు : అర కప్పు  ఉల్లి తరుగు : అర కప్పు  పచ్చిమిర్చి : రెండు స్పూన్లు  కారం : రెండున్నర స్పూన్  పసుపు : ఒక టీ స్పూన్ మిరియాలు : రెండు టీ స్పూన్లు  మెంతులు : అర టీస్పూన్ జీలకర్ర : రెండు టీ స్పూన్లు  గరం మసాలా : అర టీ స్పూన్  టమోటా తరుగు - మూడు కప్పులు  అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు  నూనె, ఉపు : తగినంత తయారీ విధానం :   ముందుగా మెంతులు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, లవంగా మిక్సీలో పేస్టులా రుబ్బుకుని పక్కన బెట్టుకోవాలి. ఈ పేస్టును పెరుగుతో కలిపి చికెన్ ముక్కలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మందపాటి బాణలి నూనెను వేడి చేసి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు ...

నోరూరించే 'బేబీకార్న్ పులావ్'

Image
మార్కెట్లో బేబీ కార్న్‌ కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇకముందు అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బేబీకార్న్‌తో నోరూరించే ఈ రెసిపీలను ట్రై చేసి ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరచండి. అలాంటి 'బేబీకార్న్ పులావ్' తయారీ చూద్దాం... కావలసిన పదార్థాలు :   బాస్మతి బియ్యం : ఒక కప్పు,  బేబీకార్న్‌లు : పన్నెండు ఉల్లిపాయ : ఒకటి కొబ్బరి పాలు (పలచగా) : రెండు కప్పులు బిర్యానీ ఆకు : ఒకటి పసుపు : చిటికెడు దాల్చిన చెక్క : చిన్న ముక్క  లవంగాలు : మూడు యాలక్కాయలు : రెండు ఉప్పు : సరిపడా నూనె లేదా నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు గుజ్జుకోసం :  కొత్తిమీర కట్టలు : రెండు వెల్లుల్లి (చిన్నవి) : ఐదు అల్లం : చిన్న ముక్క కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి : నాలుగు గరం మసాలా పొడి : పావు టీస్పూన్ తయారు చేయు విధానం :  బియ్యాన్ని కనీసం అరగంట నానపెట్టాలి. ఉల్లిపాయని నిలువుముక్కలుగా కోసుకోవాలి. బేబీకార్న్‌ను కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒకవేళ బేబీకార్న్‌ను కుక్కర్...

కూరగాయలతో కమ్మని సాంబారు ఎలా చేయాలంటే?

Image
అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకుని, సాంబార్ చేసుకుంటె కమ్మటి రుచితో పాటు మంచి పోషక విలువలు కూడా మనకు లభిస్తుంది. అలాంటి సాంబార్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం! ఇప్పుడు ములక్కాయ ఆలుగడ్డ సాంబార్ తయారీ గురించి నేర్చుకుందాం! కావలసిన పదార్థాలు: కందిపప్పు: 1 గ్లాసు ఆలు గడ్డ : 2 సాంబార్ పొడి : 2 స్పూన్స్ ములక్కాయలు, వంకాయలు: 1 కప్పు వేరుశనగ పప్పు:  1 కప్పు పచ్చికొబ్బరి: 1/2 కప్పు  చింతపండు పులుసు : 1  కప్పు పసుపు : తగినంత  కారం : సరిపడా ఉప్పు : తగినంత కరవేపాకు : 2 రెమ్మలు కొత్తిమీర : 2 రెమ్మలు ఇంగువ : చిటికెడు పోపు గింజలు : సరిపడా తయారీ విధానం: ముందుగా కందిపప్పు కడిగి కుక్కర్‌లో ఉడికించి పెట్టుకోవాలి. ఇంకో పాత్రలో తరిగి ఉంచిన ములక్కాయలు, ఆలుగడ్డ ముక్కలు, వేరుశనగపప్పు వేసి ఉడికించిపెట్టుకోవాలి. తరువాత ఇంకొక గిన్నెలో పాత్ర పెట్టి అందులో నూనె వేసి, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి. అందులో ఉడికించిన పప్పు, ఉర్లగడ్డలు, వంకాయ ముక్కలు వేసి కలియబెట్టాలి. తరువాత సాంబార్ పొడి వేసి, కారం, తగినంత ఉప్పు, చింతపండు పులుసు, కొంచెం నీరు...

వేసవికి మేలు చేసే దోసకాయతో మటన్ గ్రేవీ ఎలా చేయాలి

Image
దోసకాయ వేసవికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ డి శరీరాన్ని చల్లబరుస్తుంది. దోసకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. అంతేకాకుండా, శరీరాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. దోసకాయ, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచటం వలన మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే ''స్టేరాల్'' అనే మూలకం దోసకాయలో ఉంటుంది. అంతేకాకుండా, బరువును తగ్గించవచ్చు. అలాంటి దోసకాయతో వేసవిలో మటన్ కూర చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం.. కావలసిన పదార్థాలు :  మటన్ : అరకేజీ దోసకాయ ముక్కలు - రెండు కప్పులు ఉల్లి తరుగు - అర కప్పు టమోటా తరుగు- అర కప్పు కొత్తిమీర తరుగు - పావుకప్పు పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు, కారం - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, గరంమసాలా - ఒక చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా, నూనె - తగినంత, తయారీ విధానం :  బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి, టమోటా, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించాలి. దోరగా వేగాక అందులో దోసకాయ మ...

కొబ్బరితో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలి..?

Image
పనీర్‌లో క్యాల్షియం పుష్కలంగా ఉంది. పనీర్‌ను రోజు వారీ డైట్‌లో లేదా వారానికి ఓసారి తీసుకోవడం ద్వారా దంతాలు, ఎముకలు బలపడతాయి. క్యాన్సర్ కారకాలను నశింపజేయడంతో పాటు హృద్రోగ సమస్యలను దూరం చేసే పనీర్‌తో పసందైన వంటకాలను వండేయొచ్చు. ఈ క్రమంలో కొబ్బరితో పన్నీర్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..  కావలసిన పదార్థాలు పన్నీర్ ముక్కలు : రెండు కప్పులు  చీజ్ - అర కప్పు  వెల్లుల్లి, అల్లం పేస్ట్- ఒక స్పూన్  పంచదార - ఒక టీ స్పూన్  కొబ్బరి పాలు - ఒక కప్పు  ఉల్లి తరుగు - అర కప్పు టమోటా తరుగు- అర కప్పు  కొద్దిమీర తరుగు- పావు కప్పు,  ఎండుమిర్చి- మూడు  జీలకర్ర- అర స్పూన్  ఉప్పు, కారం, నూనె-  తగినంత తయారీ విధానం :  స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె వేయాలి. వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం దాక వేపాలి. ఆపై టమోటా తరుగు, ఎండుమిర్చి వేసి.. దోరగా వేపాలి. ఐదు నిమిషాల తర్వాత కారం, ఉప్పు, పంచదార పొడి, కొబ్బరి పాలు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. చివరిగా నేతిలో వేయ...

వానాకాలంలో నోరూరించే జీడిపప్పు చికెన్ ఫ్రై..

Image
వర్షాకాలం వేడి వేడిగా స్నాక్స్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బజ్జీలు, గారెలతో సరిపెట్టుకోకుండా జీడిపప్పు చికెన్‌ ఫ్రై ట్రైచేసి చూడండి. క్యాన్సర్, ఇన్ఫెక్షన్లు పోరాడే జీడిపప్పు, బరువు నియంత్రించే చికెన్‌తో జీడిపప్పు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం... కావలసిన పదార్థాలు :  చికెన్‌: అరకేజీ, జీడిపప్పు : అర కప్పు ఉల్లి పేస్ట్ : అర కప్పు  పసుపు : అర టీ స్పూన్  పచ్చిమిర్చి పేస్ట్ : పావు కప్పు  అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టేబుల్ స్పూన్లు   కారం : రెండు టీ స్పూన్లు  గరం మసాలా : అర టీ  స్పూన్  ఉప్పు, నూనె : తగినంత  కొత్తిమీర తరుగు : కొద్దిగా  తయారీ విధానం : శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు, పెరుగు, అల్లంవెల్లుల్లిముద్ద, ఉల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్ పట్టించి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించి దించేయాలి. ఆరిన తర్వాత బాణలిలో నూనె పోసి కారం, చికెన్‌ ముక్కలు వేసి మీడియం మంటమీద వేయించాలి. చికెన్‌ పూర్తిగా ఉడికిన తర్వాత గరంమసాలా చల్లి, ఉప్పు సరిచూడాలి. విడిగా ఓ చిన్న పాన్‌లో కొద్...

వర్షాకాలంలో జలుబుకు చెక్ పెట్టే పెప్పర్ చికెన్ ఎలా చేయాలి

Image
వర్షాకాలంలో జలుబు, దగ్గు అందరినీ వేధించే సమస్య. జలుబును, దగ్గును దూరం చేసుకోవాలంటే.. డాక్టర్ల వద్దకెళ్లి ఇంగ్లీష్ మందులకు డబ్బులు పెట్టడం కంటే.. ఇంట్లోనే పోషకాహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబును బేష్‌గా పొగొట్టడంలో పెప్పర్ చికెన్ సూపర్‌గా పనిచేస్తుంది. ఈ వంటకాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు నయమవుతుంది. అలాంటి పెప్పర్ చికెన్ ఎలా చేయాలంటే..?  కావలసిన పదార్థాలు :   చికెన్ - అరకేజీ  మిర్చి పౌడర్ - ఒక స్పూన్  పసుపు  పొడి - అర టీ స్పూన్  మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు  ఉల్లి తరుగు - ఒక కప్పు  అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్  కొత్తిమీర తరుగు - పావు కప్పు  నూనె, ఉప్పు - తగినంత  తయారీ విధానం : ముందుగా చికెన్‌కు ఉప్పు, పసుపు చేర్చి ఐదు నిమిషాల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కనబెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్‌లో కాసింత ఉప్పు, మిర్చి పౌడర్, నీటిని చేర్చి ఉడికించుకోవాలి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికితే సరిపోతుంది. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక నూనె పోసుకోవాలి. అందులో ఉల...

పనీర్‌ హెల్త్ బెనిఫిట్స్.. పాలక్ పన్నీర్ తింటే మేలెంత?

Image
పాలకూరలో ఐరన్, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండే.. పాల ఉత్పత్తుల్లో ఒకటైన పనీర్‌లో అంతకుమించిన పోషకాలున్నాయి. పనీర్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పులకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గొచ్చును. క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. బీపీని నియంత్రించవచ్చు. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ముడతలకు చెక్ పెట్టవచ్చు. జుట్టుకు పోషకాలను అందించవచ్చు. ఇలా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌తో పాలక్ పనీర్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేయండి..  కావలసిన పదార్థాలు : పాలకూర తరుగు - నాలుగు కప్పులు  నూనె, ఉప్పు - సరిపడా  జీలకర్ర - ఒక టీ స్పూన్  దాల్చిన చెక్క- 2 బిర్యానీ ఆకులు -1   ఉల్లి తరుగు - అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్  పచ్చి మిర్చి తరుగు - ఒక టీ స్పూన్  మిరప పొడి - రెండు టీ స్పూన్లు  పసుపు పొడి - ఒక టీ స్పూన్  గరం మసాలా - రెండు టీ స్పూన్లు  పనీర్ తరుగు - పావు కేజీ   నీరు - తగినంత  పాలు - అరకప్పు మొక్కజొన్న పిండి - ఒక టీ స్పూన్  తయారీ విధానం :  ముందుగా ఓ పాత్రలో పాలకూర, అల్లం, పచ్చిమ...

చపాతీలకు బెస్ట్ కాంబినేషన్ - మష్రూమ్ మసాలా ఎలా చేయాలో తెలుసా?

Image
మష్రూమ్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. మష్రూమ్‌లో సెలీనియమ్, యాంటియాక్సిడెంట్ మినరల్స్, కాపర్, నియాసిన్, పొటాషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు విటమిన్ సీ, ఐరన్ కూడా దాగివున్నాయి. మష్రూమ్స్‌ను బాగా ఉడికించి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.  కావలసిన పదార్థాలు :   మష్రూమ్స్ - అర కేజీ  మొక్కజొన్న పిండి - అర కప్పు  ఉల్లి తరుగు - రెండు కప్పులు  టమోటా తరుగు - రెండు కప్పులు కొబ్బరి తురుము - పావు కప్పు  పచ్చిమిర్చి - నాలుగు  మిరప పొడి - ఒక టీ స్పూన్  పసుపు పొడి - ఒక టీ స్పూన్  గరం మసాలా - ఒక టీ స్పూన్  ధనియాల పొడి - ఒక టీ స్పూన్  అల్లం- వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు  ఉప్పు, నూనె- తగినంత  తయారీ విధానం :   ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్‌ ముక్కలకు అర స్పూన్ పసుపు, మిర్చి, గరం మసాలా, మొక్కజొన్న పిండి, ఉప్పు చేర్చి నానబెట్టాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడయ్యాక మసాలా పట్టించిన మష్రూమ్ ముక్కల్ని దోరగా వేపు...

వేసవికి మేలు చేసే దోసకాయతో మటన్ గ్రేవీ ఎలా చేయాలి

Image
దోసకాయ వేసవికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ డి శరీరాన్ని చల్లబరుస్తుంది. దోసకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. అంతేకాకుండా, శరీరాన్ని హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. దోసకాయ, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందు వలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచటం వలన మంచి విశ్రాంతి లభిస్తుంది. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే ''స్టేరాల్'' అనే మూలకం దోసకాయలో ఉంటుంది. అంతేకాకుండా, బరువును తగ్గించవచ్చు. అలాంటి దోసకాయతో వేసవిలో మటన్ కూర చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం.. కావలసిన పదార్థాలు :  మటన్ : అరకేజీ దోసకాయ ముక్కలు - రెండు కప్పులు  ఉల్లి తరుగు - అర కప్పు  టమోటా తరుగు- అర కప్పు  కొత్తిమీర తరుగు - పావుకప్పు పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు, కారం - రెండు చెంచాలు,  ఉప్పు - తగినంత,  గరంమసాలా - ఒక చెంచా,  అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా,  నూనె - తగినంత, తయారీ విధానం :  బాణలిలో నూనె పోసి వేడయ్యాక ఉల్లి, టమోటా, పచ్చిమిర్చి తర...

మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి మీ కోసం.

Image
మష్రూమ్స్‌తో ఎలాంటి వంటకం తయారు చేసిన అద్భుతమైన రుచిని ఇస్తుంది. అలాంటిది మష్రూమ్స్‌తో గ్రేవీ చేసినా, మంచూరియన్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. అలాంటి మష్రూమ్ మంచూరియన్ డ్రై రెసిపి ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ - 1/4 కేజీ ఆలుగడ్డలు - 2 అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ పచ్చి మిర్చి - 1 స్పూన్ ఉల్లిపాయలు - 1కప్పు పంచదార - చిటికెడు చిల్లిసాస్ - 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ పిండి - 3  స్పూన్  సోయా సాస్ - 1 స్పూన్ వెనిగర్ - 1 స్పూన్ ఉప్పు, కారం - తగినంత తయారీ విధానం: ఒక గిన్నెలో శుభ్రం చేసుకున్న మష్రూమ్లను, ఉడికించిన ఆలుగడ్డలను వేసుకోవాలి. అందులోనే ఉప్పు, కారం, సన్నగా తరిగిన కొత్తిమీర కాస్తంత కార్న్‌‍ఫ్లోర్ వేసి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తరువాత ఇంకొక గిన్నె తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్ ఉప్పు వేసి నీళ్ళు పోసి కలిపి మష్రూమ్స్‌ని అందులో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా వేయించాలి.  ఇప్పుడొక పాన్ తీసుకుని అందులో నూనే పోసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత దానిలో పచ్చిమిర్చి ఉల్లితరుగు క...

రొయ్యల పచ్చడి ఎలా తయారు చేస్తారు?

Image
సీఫుడ్స్‌లో రొయ్యలది స్పెషల్ ప్లేస్. పచ్చిరొయ్యలను టేస్టీ.. టేస్టీగా వండుకుంటే ఒక్క ముద్దను కూడా మిగల్చరు. అలాంటి రొయ్యలతో చేసిన మెనూ మీ ముందుంది. మరి ఆ రుచుల్లో రొయ్యల పచ్చడి ఒకటి. దీన్ని ఎలా తయారు చేస్తారో ఓ సారి పరిశీలిద్ధాం.  కావాల్సిన పదార్థాలు..  రొయ్యలు : అర కేజీ కారం : సరిపడ ఉప్పు : సరిపడ నిమ్మకాయలు : 5 గరంమసాలా పొడి : ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులపొడి : ఒక టీ స్పూన్ ఆవపొడి : 2 టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ : 30గ్రా నూనె : తగినంత. తయారీ విధానం రొయ్యలను బాగా కడిగి నీళ్లు లేకుండా వడగట్టాలి. కాసేపు గాలికి ఆరబెట్టాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి రొయ్యలను దోరగా వేయించుకుని ఓ గంట పాటు పక్కనపెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో కారం, ఉప్పు, గరంమసాలాపొడి, జీలకర్రమెంతుల పొడి, ఆవపొడి, అల్లం, వెల్లుల్లిపేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత నూనె పోసి మరోసారి కలపాలి. ఇప్పుడు వేయించిన రొయ్యలను కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. వేడి.. వేడి అన్నంలోకి ఈ పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. 

వింటర్‌లో మిర్చి ఘాటుతో వెరైటీ చికెన్ గ్రేవీ..

Image
అసలే వింటర్. వేడి వేడి సూప్స్, స్నాక్ మీద మనస్సు మళ్లుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి వేడినిచ్చే చికెన్‌తో.. శరీరంలోని బ్యాక్టీరియాను నశింపజేసే మిర్చి కాంబోలో వెరైటీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..  కావలసిన పదార్థాలు : చికెన్ - అర కేజీ  ఎండు మిర్చి - ఆరు  ఆవనూనె - నాలుగు టేబుల్ స్పూన్లు  దాల్చిన చెక్క- రెండు ముక్కలు  ఏలకులు - ఐదు శొంఠి పొడి- అర టీ స్పూన్  సోంపు పొడి- టేబుల్ స్పూన్  కారం- చెంచా పసుపు- అర చెంచా  ఉప్పు - తగినంత  నూనె, నీరు - తగినంత  తయారీ విధానం:  ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్ట్, కారం వేసుకోవాలి. నిమిషం తర్వాత నీళ్లు పోసి.. అందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి దోరగా వేపాలి. అన్నీ బాగా వేగాక.. చికెన్ ముక్కలు తగినంత నీరు పోసుకోవాలి. నీరు సగం అయ్యాక చికెన్ గ్రేవీలా అయ్యేంత వరకు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఈ చికెన్ కూరను వ...