కాశ్మీరీ మటన్ ఘోస్ట్‌ను ఎలా తయారు చేస్తారు?

కావలసిన పదార్థాలు :

ఎముకలు లేని మేక మాంసం... అరకేజీ
పెరుగు... ఒక కప్పు
యాలక్కాయలపొడి... తగినంత
జాపత్రి... తగినంత
దాల్చిన చెక్క... చిన్న సైజువి రెండు
జీడిపప్పు... వంద గ్రా. (పేస్టు చేయాలి)
అల్లం వెల్లుల్లి ముద్ద... సరిపడా
నూనె... సరిపడా
మీగడ... తగినంత

తయారీ విధానం :

మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి, జీడిపప్పు ముద్ద, పెరుగు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి కాగిన తరువాత యాలక్కాయల పొడి, జాపత్రి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. 

కాసేపలా వేగిన తరువాత మీగడ, ఉడికించిన మేకమాంసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మాంసం మెత్తగా ఉడికి, కూర దగ్గర పడుతుండగా దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే కాశ్మీరీ ఘోస్ట్ తయారైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పరోటా, దోసెలతోపాటు తింటే చాలా రుచిగా ఉంటుంది. 

Comments

Popular posts from this blog

ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ తయారీ ఎలా?

చేదు చేదు కాకరతో.. టేస్టీ స్టఫింగ్ ఎలా చేయాలి..?

మటన్ ఖీమా పకోడా: వీకెండ్ స్పెషల్