Posts

కొబ్బరి రవ్వ బర్ఫీలు... చాలా టేస్ట్, ఎలా చేయాలో తెలుసా?

Image
పిల్లలకు స్వీట్ అంటే చాలా ఇష్టం. నిత్యం షాపులో కొని తేవడం కంటే కొన్ని సార్లు ఇంట్లోనే చేస్తేనే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. కొబ్బరి ఆరోగ్యానిక చాలా మంచిది. అంతేకాకుండా కొబ్బరి రవ్వ బర్ఫీలాంటివి చేయడం చాలా సులువు... అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ - పావుకిలో, పంచదార - అరకిలో, పచ్చి కొబ్బరి - అర చెక్క, నెయ్యి - పావుకిలో, జీడిపప్పు - గుప్పెడు, యాలకుల పొడి - ఒక టీ స్పూను తయారుచేసే విధానం... కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసి తురుములా చేసుకోవాలి. దానిని కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును కూడా తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గోధుమ రవ్వని వేసి వేయించాలి. కాస్త బ్రౌన్ రంగులోకి మారేవరకు ఉంచి తీసేయాలి.  ఇప్పుడు మరో గిన్నె స్టవ్ మీద పెట్టి పంచదార నీళ్లు కలిపి వేడిచేయాలి. పాకం సాగేలా వచ్చినప్పుడు అందులో వేయించిన గోధుమరవ్వ, కొబ్బరి తురుము జీడిపప్పు వేసి బాగా కలపాలి. కాస్త నెయ్యి కూడా వేస్తూ... కలుపుతూ ఉండాలి. మిశ్రమం కాస్త దగ్గరగా అవుతున్న సమయంలో స్టవ్ కట్టేయాలి. ...

జొన్న కేక్ ఎలా చేయాలంటే..?

Image
కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 150 గ్రా చక్కెర - 70 గ్రా అరటిపండ్లు - 3 గుడ్లు - 3 డాల్డా - అరకప్పు పాలు - అరకప్పు ఎసెన్స్ - నాలుగు చుక్కలు ఉప్పు - సరిపడా. తయారీ విధానం: ముందుగా జొన్నపిండిలో బేకింగ్ పౌడర్, ఉప్పు, సోడా కలిపి జల్లించుకోవాలి. తరువాత చక్కెరలో డాల్డా కలిపి క్రీమ్ చేసుకోవాలి. ఆపై కోడిగుడ్లని బాగా గిలకొట్టి క్రీమ్‌కి నిదానంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు, అరటిపండ్ల పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన కేక్ గిన్నెలో వేసి 325 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉడికించాలి. ఆపే ఓవెన్‌లో నుండి కేక్‌ని బయటకు తీసి చల్లారిన తరువాత కట్ చేసుకోవాలి. అంతే... జొన్న కేక్ రెడీ అయినట్లే...

ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ తయారీ ఎలా?

Image
చలికాలంలో ఏ కూర చేసినా అంతగా తినాలని అనిపించదు. అయితే గొంగూర ఉంటే మాత్రం ఎంచక్కా లాగించేస్తాం. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర అంటే చాలా మందికి నోరూరుతుంది. అలాంటి గోంగూరతో చట్నీనే కాదు ఇతర వంటకాలు కూడా చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు :  బోన్లెస్ చికెన్: అర కేజీ ‌గోంగూర : ఒక కట్ట అల్లం, వెల్లుల్లి పేస్టు : రెండు స్పూన్లు గరం మసాలా : 1 స్పూన్ పచ్చిమిర్చి : మూడు పసుపు : చిటికెడు ఉల్లిపాయలు : మూడు పోపుదినుసులు : 1 స్పూన్ కారం : రెండు టీస్పూన్లు నూనె : సరిపడా ఉప్పు : తగినంత కొత్తిమీర : తగినంత తయారీ విధానం :    చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను ఉడికించి మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాత్రలో నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి అవి వేగాక చికెన్ ముక్కల్ని కూడా వేసి సన్నని మంటపై మగ్గనిచ్చి సరిపడా నీరు పోసి కొంచెం సేపు ఉడికించాలి.  ఇప్పుడు ముందుగానే రుబ్బి పెట్టుకున్న గోంగూర ముద్ద, గరంమసాలా వేసి మరి కొంచెం సేపు ఉడికించాలి. దించుకునే ము...

చేదు చేదు కాకరతో.. టేస్టీ స్టఫింగ్ ఎలా చేయాలి..?

Image
కాకరకాయలు రుచికి చేదుగా ఉంటాయి కాబట్టి తినడానికి అంతగా ఇష్టపడరు. చిన్నపిల్లలైతే అసలే తినరు. కాకరలో చాలా రకాలున్నాయి. వీటిలో పొడుగు, పొట్టి రకాలే కాకుండా లేత ఆకుపచ్చ, తెలుపు కలగలసిన రంగులలో కూడా ఉంటాయి. కాకరకాయ వైద్యపరంగా ఔషధంగా ఉపయోగ పడుతుంది. దీన్ని ఆయుర్వేద వైద్యంలో అధికంగా ఉపయోగిస్తారు. కాకరను వారానికి ఓ సారి ఆహారంలో తీసుకుంటే మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. అలాంటి కాకరతో స్టఫింగ్ ఎలా తయారుచేయాలో చూద్దాం.. కావలసిన పదార్ధాలు కాకరకాయలు - 5 ఆలుగడ్డలు - 3 (ఉడికించినవి)  ఉల్లిపాయతరుగు - 1/2 తరిగినవి ధనియాల పౌడర్ - 1 స్పూన్  నూనె - వేయించడానికి సరిపడా జీలకర్ర పౌడర్ - 1 స్పూన్  పోపు దినుసులు - తగినంత కారం - సరిపడా ఉప్పు - రుచికి తగినంత పసుపు -చిటికెడు పచ్చిశెనగలు - 2 స్పూన్   నూనె - సరిపడా తయారీ విధానము: కాకరకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాడలని కట్ చేసి లోపల వున్న విత్తనాలను తీసెయ్యాలి. ఒక మందపాటి గిన్నెలో కాకరకాయ ముక్కలను వేసి, రెండు గ్లాసుల నీళ్ళు పోసి, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసి, ఉడికించుకోవాలి. కాకరకాయలు ఉడికిన తరవాత, న...

బనానా కోఫ్తా కర్రీ ఎలా చేయాలి?

Image
అరటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కంటికి మేలు చేస్తుంది. అలాంటి అరటికాయలతో అరటి కోఫ్తా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం కావలసిన పదార్థాలు : అరటికాయలు - 3 అల్లం పేస్ట్‌ -  తగినంత పసుపు పొడి - చిటికెడు కారం - సరిపడా, వెల్లుల్లి పేస్ట్‌ - తగినంత గరంమసాలా పౌడర్‌ - 1 స్పూన్‌, కోడిగుడ్డు - 1 శనగపిండి - 2 స్పూన్‌‌లు, పంచదార - 1 స్పూన్‌, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - డీప్‌ ఫ్రై చేయడానికి సరిపడా.  తయారీ విధానం :  ముందుగా అరటికాయలను తొక్క తీయకుండా ఉడికించుకోవాలి. తరువాత తొక్క తీసి ఒక పాత్రలో పెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె మినహా పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసి వేడి చేసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుంటూ నూనెలో వేసి ఫ్రై చేయాలి. బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ తరువాత మిగిలిన నూనెలో జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, కారం, పంచదార, గరం మసాలా వేసుకుని అందులో రెండు కప్పుల నీళ్...

కాశ్మీరీ మటన్ ఘోస్ట్‌ను ఎలా తయారు చేస్తారు?

Image
కావలసిన పదార్థాలు : ఎముకలు లేని మేక మాంసం... అరకేజీ పెరుగు... ఒక కప్పు యాలక్కాయలపొడి... తగినంత జాపత్రి... తగినంత దాల్చిన చెక్క... చిన్న సైజువి రెండు జీడిపప్పు... వంద గ్రా. (పేస్టు చేయాలి) అల్లం వెల్లుల్లి ముద్ద... సరిపడా నూనె... సరిపడా మీగడ... తగినంత తయారీ విధానం : మేక మాంసాన్ని శుభ్రంగా కడిగి, జీడిపప్పు ముద్ద, పెరుగు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నూనె వేసి కాగిన తరువాత యాలక్కాయల పొడి, జాపత్రి, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.  కాసేపలా వేగిన తరువాత మీగడ, ఉడికించిన మేకమాంసం కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మాంసం మెత్తగా ఉడికి, కూర దగ్గర పడుతుండగా దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే కాశ్మీరీ ఘోస్ట్ తయారైనట్లే..! ఇది వేడి వేడి అన్నం, చపాతీ, పరోటా, దోసెలతోపాటు తింటే చాలా రుచిగా ఉంటుంది. 

అజీర్తికి చెక్ పెట్టే మెంతికూర చికెన్ ఎలా చేయాలో తెలుసా?

Image
మెంతికూర, మెంతులు అజీర్తికి చెక్ పెడుతాయి. కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి వాటికి చెక్ పెట్టాలంటే.. మెంతికూరను ఆహారంగా తీసుకోవాలి. మెంతికూర పప్పు, మెంతికూర వంటి రొటీన్ వంటకాలతో బోర్ కొట్టేస్తే.. మెంతికూరతో చికెన్ ట్రై చేసి చూడండి. ఎలా చేయాలంటే..? కావలసిన పదార్థాలు  చికెన్ : ఒక కేజీ  మెంతికూర : రెండున్నర కప్పు  పెరుగు : అర కప్పు  ఉల్లి తరుగు : అర కప్పు  పచ్చిమిర్చి : రెండు స్పూన్లు  కారం : రెండున్నర స్పూన్  పసుపు : ఒక టీ స్పూన్ మిరియాలు : రెండు టీ స్పూన్లు  మెంతులు : అర టీస్పూన్ జీలకర్ర : రెండు టీ స్పూన్లు  గరం మసాలా : అర టీ స్పూన్  టమోటా తరుగు - మూడు కప్పులు  అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టీ స్పూన్లు  నూనె, ఉపు : తగినంత తయారీ విధానం :   ముందుగా మెంతులు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, లవంగా మిక్సీలో పేస్టులా రుబ్బుకుని పక్కన బెట్టుకోవాలి. ఈ పేస్టును పెరుగుతో కలిపి చికెన్ ముక్కలకు పట్టించి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మందపాటి బాణలి నూనెను వేడి చేసి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు ...