ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి
ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపి ఒక గ్రేట్ పార్టీ ఫుడ్. ఈ కబాబ్ రిసిపి చాలా స్మూత్ గా మరియు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది చికెన్ మలై కబాబ్ రిసిపి ఒక సారి తయారుచేసి, తిన్నట్లైతే ఈ రిసిపిని మనం ఇంతకు ముందే ఎందుకు రుచి చూడలేదు అన్న భావన కలుగుతుంది అంత అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది. క్రీమ్ బట్టర్ వంటి స్మూతీ ఐటమ్స్ తో తయారుచేయడం వల్ల దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని మసాలదినుసులతో మ్యారినేట్ చేయడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది. ముర్గ్ మలై చికెన్ కబాబ్ రిసిపిని నాన్ మరియు సలాడ్స్ తో తీసుకుంటే మంచి కాంబినేషన్ ఫుడ్ . మరి ఈ టేస్టీ నాన్ వెజ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం... కావలసినపదార్థాలు ఎముకలు లేని చికెన్: 1/2 kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) ఉప్పు: రుచికి సరిపడా వైట్ పెప్పర్ పౌడర్ : 1 tsp నెయ్యి లేదా వెన్న: పైన బ్రషింగ్ కోసం మసాలా చాట్: పైన చిలకరించడం కోసం మ్యారినేషన్ కోసం: అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 tbsp పచ్చి మిర్చి : 3(సన్నగా తరిగిపెట్టుకోవాలి) కొత్తిమీర: 1/4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)...