ఆహా నోరూరించే పనీర్ అండ్ రాజ్మా కర్రీ

పనీర్ అండ్ రాజ్మా రెండూ బాగా పాపులర్ అయిన ఫుడ్ ఐటమ్స్. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కు చాలా ఫేమస్. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసే వంటి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ డిష్ తయారుచేయడానికి ముందుగా రాజ్మాను 4గంటల పాటు నీటిలో వేసి నానబెట్టుకోవాలి . 

దాని తర్వాత రాజ్మాను ఉడికించుకోవాలి . రాజ్మాను ఉడికించేటప్పుడు అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. రుచి, మంచి ఫ్లేవర్ ఉన్న ఈ సాప్ట్ అండ్ క్రీమి డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...


 



కావల్సిన పదార్థాలు: 



రాజ్మా : 1 &1/2 cup
 పనీర్ : 150 gms 
ఉల్లిపాయ : 2 (చిన్న ముక్కలుగా తరిగాలి) 
టొమాటో : 2 (సన్నగా తరిగినవి) 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పసుపు : 1/2 tsp 
కారం : 1/2tsp 
ధనియాల పొడి : 1 tsp
 జీలకర్ర : 1/2 tsp
గరం మసాల : 1/4tsp 
ఉప్పు: రుచికి సరిపడా 
నూనె : తగినంత 


తయారుచేయు విధానం: 



1. ముందుగా రాజ్మాను ఉడికించుకోవాలి. ఉడికించిన నీటిని పక్కన తీసి పెట్టుకోవాలి.
 2. తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు మరియు టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
 3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
 5. ఇప్పుడు అందులో టమోటో గుజ్జు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. 
6. ఫ్రై చేస్తున్నప్పుడు, నూనె పైకి తేలి పోపు పచ్చివాసన పోయే వరకూ ఉడికించుకోవాలి. 
7. ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలు వేసి 5నిముషాలు ఫ్రై అయిన తర్వాత అందులో రాజ్మా ఉడికించిన నీటిని పోసి బాగా మిక్స్ చేయాలి. 
8. పన్నీ మెత్తగా ఉడికే సమయంలో అందులో రాజ్మ, మరియు గరం మసాలా కూడా వేసి మంటను మీడియంగా పెట్టి ఉడికించుకోవాలి. 10నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే పనీర్ మరియు రాజ్మా కర్రీ రిసిపి రెడీ..





Comments

Popular posts from this blog

ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ తయారీ ఎలా?

చేదు చేదు కాకరతో.. టేస్టీ స్టఫింగ్ ఎలా చేయాలి..?

మటన్ ఖీమా పకోడా: వీకెండ్ స్పెషల్