హెర్బ్ ఫ్రైడ్ రైస్ రిసిపి -బెటర్ హెల్త్

వర్షాకాలంలో చాలా త్వరగా జబ్బును పడుతుంటారు. అందుకు కారణం శరీరంలో వ్యాధినిరోధకత లోపించడం . కాబట్టి, ఆ వ్యాధినిరోధకత పొందాలంటే హెల్తీ ఫుడ్స్ ను తినాల్సిందే. అందుకు హెర్బ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. వర్షాకాలంలో ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. హెర్బ్స్ ను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఎక్కువగా టీల రూపంలో తీసుకోవడం మనం చూస్తుంటా అయితే కాస్తంత వెరటీగా ఫుడ్స్ తయారీలో జోడిస్తే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు మరియు ఎనర్జీని పొందవచ్చు .
హెర్బ్స్ అంటే పార్ల్సే, తులసి, మరియు గ్రీన్ ఆనియల్ వంటివి డయాబెటిక్ పేషంట్స్ కు ఎక్కువగా సహాయపడుతాయి. అంతే కాదు త్వరగా బరువు తగ్గడానికి, బ్లడ్ ప్రెజర్ లెవల్స్ కంట్రోల్ చేయడానికి మరియు హార్ట్ అటాక్ ను నివారించడానికి సహాయపడుతాయి. ఈ మూలికలు శరీరంలో మలినాలను తొలగిస్తుంది మరియు రక్తంను శుభ్రపరుస్తుంది. మరి ఈ రుచికరమైన హెర్బల్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...





కావల్సిన పదార్థాలు:


 అన్నం - 4-5 cups(రైస్ వండినది)
 వెల్లుల్లి రెబ్బలు- 2 (కచపచా దంచుకోవాలి)
 బాసిల్(తులసి) - ¼cup(సన్నగా కట్ చేసుకోవాలి ) 
పార్ల్సే - ¼cup (సన్నగా కట్ చేసుకోవాలి) 
ఉల్లిపాయలు - ¼
cup (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఆలివ్ ఆయిల్- 2 tbsp 
ఉప్పు: రుచికి సరిపడా


తయారుచేయు విధానం: 


1. ఒక పెద్ద పాన్ లో కొద్దిగా ఆలివ్ ఆియల్ వేయాలి. 
2. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, పార్ల్సే, తులసి మరియు గ్రీన్ ఆనియన్స్ (ఉల్లికాడలు). ఒక నిముషం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లికాడులు ముదురు రంగులోకి మారి, మంచి సువాసన వస్తుంది.
 3. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న అన్నం వేసి ఫ్రై చేసుకోవాలి. 
4. చివరగా ఉప్పు చిలకరించి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని ఫ్రై చేసుకోవాలి.




Comments

Popular posts from this blog

ఆంధ్రా స్పెషల్ గోంగూర చికెన్ తయారీ ఎలా?

చేదు చేదు కాకరతో.. టేస్టీ స్టఫింగ్ ఎలా చేయాలి..?

మటన్ ఖీమా పకోడా: వీకెండ్ స్పెషల్